Sunday, March 22, 2015

ఉగాది పచ్చడి

రాతమని ఉందిగాని రాసేందుకు మంచి ఆలోచనలు రాకపాయె. ఏదో ఒకటి రాతమంటే ఓపికా తీరికా లేకపాయె.

చిన్నప్పుడు నాన్న ఎన్ని సార్లు చెప్పినడో రాత అలవాటు చేసుకోరా అని. రాయడం అందరికి చాతకాదు.. వచ్చిన వాడు రాయకపోతే లాభమేముంది అని. అప్పుడు చిన్న వాణ్ని కద… నాన్న చెప్పిన మాట అర్థం కాలేదు. అర్థమైనా, ధ్యాస వేరే వైపు మళ్ళింది.. ఆఁ, నాన్న ఎప్పటికి అట్లనే అంటుంటడులే అని నా పనికిరాని పనులు నేను చేస్తునే ఉండిన.

ఇంతట్లో చదువైపోయి ఉద్యోగం ఒచ్చింది. నాకు గనుక ఉద్యోగమొచ్చింది కదా అని రాత్రి పగలు తెల్వకుండ పనిలో పడి కొట్టుమిట్టాడి మొత్తానికి చేసే పనిలోనే ఏదో ఒకటి సాధిద్దమనుకున్న. కొన్ని రోజులకు ఆ పనే జీవితమైంది. అది తప్ప వేరే ప్రపంచమే తెల్వకుండైంది. అట్లని కొండలు పడగొడ్తున్నమా అంటే అదేం లేదు అని అర్థమైంది. ఆ విషయం అర్థమైనా, చేసిందే గొప్ప పని అని అనుకోని, ఇంత కంటే మన వల్ల కాదని సర్దుకోవడం మొదలు పెట్టిన. అక్కడికి సంతృప్తి పడి ఊరుకున్న. ఇంకా నాన్న “ఇప్పటికన్న ఏదో ఒక పనికొచ్చే పని మొదలు పెట్టు రా” అని చెప్తునే ఉన్నడు. నాకు రాయరాదు, అసలు తీరిక లేదు, ఉద్యోగం చేసి ఇంటికొచ్చే వరకే అలిసిపోతున్న అని ఏవో సాకులు చెప్పి మళ్ళ ఊరుకున్న.

రోజులు ఏమి చేయకుండనే గడిచినయి.. తెల్వకుండనే నెత్తిన ఎంటికలు కూడ నెరిసినయి. ఇప్పటికన్నా మా వాడు అర్థం చేసుకుంటడేమో అని నాన్న పట్టు వదలని విక్రమార్కుడి లాగ నా వెంట పడ్డడు. ఉద్యోగం చేయడం మొదలు పెట్టి శాన్నాళ్ళు అయ్యింది కద... పనిలో బాధ్యతలు పెరిగినయి, అస్సలు వీలు లేదు అని అప్పటికి కూడా ఏం చేయలేదు.

కొన్ని రోజులకు ఆ ఉద్యోగం మీదగూడ ప్రేమ లేకుండయ్యింది కానీ దాన్ని వదిలేతమనుకుంటే ధైర్యం చాలలేదు. ప్రతి రోజు మెదడు ఉపయోగించే అవసరం లేకుండ ఒకటే పని చేసి చేసి ఆ మెదడు మోద్దుబారినట్టు అయ్యింది. ఇక్కడ కాక ఇంకొక చోట పని చేయగల్తానో లేదు అని నా మీద నాకే అనుమానం వచ్చే వరకు ఉన్న ధైర్యం కూడ ఎగిరిపోయింది. ఎం చేయాలో తోచలేదు.. ఏం చేయగల్తానో అర్థం కాలేదు. ఇట్ల ఆలోచించుకుంటు చాలా రోజులు నా మీద నాకే విసుగొచ్చింది. మెల్లె మెల్లెగ తెలివొచ్చింది. ఆ తెలివితోబాటు నేను ఎంత తెలివితక్కువ వాణ్ణో తెలిసొచ్చింది. ఇన్ని రోజులు అసలు పనికోచ్చే పని ఒక్కటన్న చేసిన్నా అని ఆలోచించి చూస్తే ఎమీ తోచలేదు.

ఇన్నేండ్లు అయినా, నాన్నకు నా మీద నమ్మకం మాత్రం పోలేదు. ఎప్పటికన్నా ఏదో ఒకటి చేసి తీరుత అని గట్టిగ నమ్ముతునే ఉన్నడు. కొడుకును మంచి దారి లో పెట్టి, మంచి పనులు చేయాలని ప్రోత్సహించడం, ఆ మాటలు వాడు ఎప్పటికో ఒకప్పటికి వింటడని నమ్మడం ఆయన బాధ్యత మరి. అట్లనే ఆ నమ్మకాన్ని నిలబెట్టడం, నాన్న చూపిన మార్గం లో నడవడం నా బాధ్యత కదా అని ఇప్పటికి తోచింది. ముప్ఫై ఏండ్లు వచ్చిన తరువాత ఇప్పుడు కొంచం బుద్ధి ఒచ్చింది. ఇప్పటికి కూడా ఎంతొచ్చిందో నాకే తెలువదు. తెలివొచ్చిందని అనుకోవడం కూడ తెలివితక్కువతనమే.. మనిషికి తెలివొచ్చినా కొద్దికి తన తెలివితక్కువతనం తెలిసి రావాలె. మనకెమీ తెలువదని అర్థం చేసుకోవడమే జ్ఞానమేమో!

ఈ జ్ఞానం సంపాదించేందుకు ఏడు సముద్రాలు దాటి వేరే ప్రపంచానికి రావాల్సి ఉంటుందా? ఇంట్లో ఉన్నప్పుడే ఈ విషయం అర్థం కాదా? ఆలోచిస్తే అంతే అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇంట్లో వాళ్ళ విలువ, సొంత విలువ అర్థం కాదేమో.. దానికి ప్రపంచం అలలలో పడి ఈత కొట్టాల్సిందేనేమో!

ఉగాదికి ఇంట్లో అమ్మ పచ్చడి చేసింటుంది. తినేందుకు నేనక్కడ లేకపోతి. పచ్చడిలో పచ్చి మామిడికాయ దబ్బలు ఏసింటుంది.. దాని రుచి కూడ నేను మరిచిపోతి. అయిన వాండ్లకు దూరంగ, దెగ్గర ఉన్న వాండ్లతో మౌనంగ.. ఇట్ల ఎన్నాళ్ళు ఉంటమా అని అనిపిస్తుంది కానీ.. జీవితంలో ఈ అనుభవం కూడ అవసరమే. ఈ అనుభవమే మ అందరికంటే భిన్నంగ ఆలోచించే శక్తిని ఇస్తుంది… అట్లనే, అందరిని అర్థం చేసుకునే శక్తిని కూడా ఇస్తుంది. ఇది నా అభిప్రాయం!

మొత్తానికి మొదలు పెట్టిన ఒక కథ. ప్రస్తుతానికిది నా కథనే. రాను రాను దీంట్లో ఏమి మార్పులొస్తయో ఆగి చూద్దం!

Wednesday, March 18, 2015

Changes, choices

Well, its been a while, hasn’t it?

Things have happened in life at such a pace that if I try recounting everything of significance that happened between now and the last blog post, I would end up writing a book, and not a blog. Maybe it is time I wrote a book now. Why, you ask? The answer is forthcoming.
Without delving into the details, let me highlight a few of the details of what happened to me in the recent past, starting from the latest:
  • I turned thirty. Yes people, please welcome me to the club, tell me how boring life is going to be from now, and so on and so forth. This is all that everyone even a few months older than me have said and done in the last one week. So instead of thinking of how dull the future is going to be, I have decided to reflect on how interesting the past has been.. which brings us to the book. I think its time someone documented the happenings (and lack thereof) in the boring life that is mine, and who better to do so than myself?
  • I find it very amusing and intriguing that eight years after starting to work, I never had a previous employer till very recently. For better or for worse, now I do.
  • I have attained enlightenment. Don’t ask me how or what it feels like, its not something common mortals can comprehend. In other words, I myself have no clue.
  • I re-watched all 295 episodes of DragonBall Z. Yes, this is a significant life achievement, no matter what your opinion on the matter is.
  • I went into and back out of good shape. After a year and a half of regular exercise and healthy eating, I lapsed into being a lazy slob for a few months.. and all that was done previously was undone. This makes me sad.
  • Jumping back two years in time: I got married. Were you expecting any elaboration here? I am sorry to disappoint you, but there is such a thing as privacy, and I would like some if it. ;)
And just like that, five years of a person’s life can be summarized in five paragraphs. More can be said, but I think it's better not to let the creative juices flow in excessive abundance. Let’s leave the rest for another day, which hopefully, isn’t very far.